Monday, November 23, 2009

కొన్ని మెచ్చు తునకలు గ్లాచ్చు మీచ్చూ నుంచి


గ్లాచ్చు మీచ్చూ


పదేళ్ళ క్రితం జయదేవ్ గారితొ మొదలైన పరిచయం, ఆయన హైద్రాబాద్ లొ గడిపిన తరువాతి ఐదు సంవత్సరాలు ఆయనతొ సాన్హిత్యాన్ని పెంచాయి, ఉద్యోగం పేరు చెప్పి మొదట నన్ను దగ్గరకు తీసుకున్నారు, తర్వాత్తర్వాత మనసుకు దగ్గరకు తీసుకున్నారు, వేషం లోనూ భాషలోనూ ప్రవర్తనలొనూ అయనా చాలా సింపుల్, మానవ ప్రేమి, నరుడు నరుడౌట దుష్కరమ్ము అన్న గాలీబ్ ని చూసి చిరునవ్వారు.
నాతరం చిత్రకారుల్లొ నేను కాక ఆయనకు దగ్గరైన వాల్లెవరూ లెక పొవడం నా అద్రుష్టం , అందుకే బాపూ, బాలి, చంద్ర ,మొహన్ గారిలాంటి మహా చిత్రకారులతొ స్నేహం వున్నప్పటికీ , ఆయన 70 ఏళ్ళ అనుభవాలకునన్నుముఖచిత్రం గీయమన్నారూ. ఆయనతొ వున్న ఐదు సంవత్సరాల సాన్హిత్యమ్ వల్ల ఆయనను బాగా తెలుసనుకున్నాను , ఈ పుస్తకం చదివాక అలా అనుకున్నందుకు సిగ్గు చెందాను , అది మనకు మామూలె అన్నది వేరే విషయం.
భగవంతుని దయవలన, చెళ్ళ పిళ్ళ వారి కథలూ గాధలు దగ్గర్నుంచి రాంభట్లవారి సొంత కథ దాక చదివా, ముళ్ళ పూడి దేవుడ్రావు గారి కొతికొమ్మచ్చి చదువుకుంటున్నా, ఇప్పుడు జయదేవ్ గారి గ్లాచ్చు మీచ్చూ , అచ్చూ అదే. ఎప్పట్లాగే కొందరే మహానుభావులు మా జయదేవ్ గారిలా.
ప్రతులకు
విఎన్నార్ బుక్ వరల్డ్
చౌడెపల్లి - 517257
చిత్తూరు జిల్లా
పొన్-044-25551269

Tuesday, November 10, 2009

కార్టూన్ కబుర్లు చెప్పని కబుర్లు



Friday, October 16, 2009

దీపావళి శుభాకాంక్షలతొ ఒక క్రిష్ణుడు


Tuesday, October 6, 2009

చిత్రకళ మరియు విమర్శ



ఆకు అడ్డుకోత, మూత్రపిండాల నిలువుకోత పటాల్ని పెయింటింగులు మలిచి సూపర్ హిట్ కొట్టిన చిత్రకారులకు అంకితం.

Friday, October 2, 2009

జర్నలిస్టులు -కళా హ్రుదయము


వార్తలొ చేరిన మూడొ లేదా ఏడొ రొజు ఒక పిల్లల పేజీని వండే డిపార్ట్మెంట్ వారు " అన్వర్ గారు ఆదివారం పుస్తకం లొ ఒక పిల్లల కథ పెట్ట బొతున్నాం, ఒక మంచి బాగా ఇదిగా అదిరిపొయే బొమ్మ వేయండి అనీ అనంగానే సంబరపడిపొయి కొత్త వుజ్జొగం లొ రంగుల బొమ్మ అని ఫీలయి పొయ్యి అక్రిలిక్ కలర్స్ అని కొత్తగా కొన్నాము కదా అయ్యెట్టి చెట్టును తెగ నరికాను , ఎప్పట్లాగే సీన్ కట్ చేస్తే ఆ అదివారం రొజున ఇంతొటి బొమ్మ మీ బొటన వేలి గొరును రెడుతొ భాగిస్తే వచ్చేంత సైజ్ లొ అచ్చయింది. షాక్!!!!
ఇదంతా ఒక పిల్లల పత్రిక పెట్టిన గురువుగారిముందు వాపొతే అరే బొమ్మ బ్రహ్మాండం గురూ మనం వాడేద్దామని ఆవిధంగా దానికి తగిన న్యాయం జరుగుతుందన్నారు , కాని కొన్ని రొజుల పిదప బొమ్మ పొయిందని చెప్పి నాకు తగిన శాస్త్రి జరుపబడినది , అనుకొకుండా బుర్ర లాంటిది పనిచేసి ఈమాత్రమైనా స్కానింగ్ చేసి పెట్టుకున్నా.

Thursday, August 27, 2009

స్వామి ఝండూ బాం



స్వామి ఝండూ బాం అనే కారెక్టర్ తొ కామేడీ ఆఫ్ ఎర్రర్స్ తరహా కథలు నడిపించాలని కొరిక , దేవుడు రవ్వంత రేఖను ఇచ్చాడు గాని బుర్రను ఇవ్వని కారణం గా ఆ విధంగా ముందుకు సాగలేక పొతున్నాం.