Tuesday, December 1, 2009

హెలొ !! అయాం నారాయణ స్వామి ఫ్రం అమెరికా


తొలిసారి నా బ్లాగులొ కామెంటిన మొదటి రెండు కామెంట్లలొ ఒకటి నారాయణ స్వామి గారిది లేదా కొత్తపాళి గారిది, తర్వత్తర్వాత దాదాపుగా నా ప్రతి పొస్ట్ మీదా ఆయన స్పందన తెలుస్తూనే వుండేది, నా ఫ్లికర్ లొని బొమ్మలు చూసి ఆయన చాలా ముచ్చట పడినట్టు ఆయన పంపిన ఒక లేఖలొ తెలిపారు, వొ మధ్యలొ నేను వ్రాసిన ఒక పొస్ట్ చదివి ఆవేశ పడిపొయి శభాషని మెచ్చేసుకుని " నేనంటూ పుస్తకం వేస్తే , నాదంటూ పుస్తకం వస్తే, మీరే బొమ్మలు వెయ్యాలి అని బెదిరింపు కూడా కామెంటారు, ఇట్టాంటి బెదిరింపులెన్నొ చూసిన ప్రాణానికి లెఖ్ఖ జమా జడుపు అవలేదు. వొ వారం పదిరొజుల తరువాత పిల్ల పెసర వుత్పత్తిలొ పచ్చ తెగులుపాత్ర పై తులనాత్మక పరిశీలన లాంటి విచిత్రమైన నెంబర్తొ నాకు పొనొచ్చింది , అది డెట్రాయిట్ నంబరని , మాట్లాడేది నారాయణ స్వామిగారని మాట్లాడారు, ఆయన తన కథల్తొ పుస్తకం తెద్దామనుకుంటున్నారని నాచేతే బొమ్మలు వేయించుకుంటుందామనుకుంటున్నానని వొట్టి బెదిరింపు కాదని కూడా అన్నారు.
మొత్తం 21 కథలు ఆరు గల్పికలతొ సహా , కథలు మెయిల్ లొ చేరక మునుపే అదేదొ సూపర్ సానికొ, కాంకార్డొ ఆ పద్దతిలొ అడ్వాన్స్ కూడా పంపారు. దేముడికి, నారాయణ స్వామిగారికి దండం పెట్టుకుని ( కేరళ ని గాడ్స్ వొన్ కంట్రి అంటారు గాని వొట్టిదే ఆయనది అమెరికా అని అందులొ డెట్రాయిట్ అని అర్ధం అయ్యింది) నామనసుకు నచ్చినట్టు బొమ్మలు వేసుకుంటూ వెల్లాను, 21 బొమ్మల్లొ 17 నాకెంతొ త్రుప్తినిచ్చాయి, నాచేత బొమ్మలు వేయించినందుకు పైగా డబ్బులు కూడా ఇచ్చి, ఆయనకు థేంక్స్.
ఆయనిలాగే 10 కాలాల పాటు కథలు వ్రాయాలని, నాతొనే బొమ్మలు వేయించుకొవాలని దేవున్ని కొరుకుంటూ , అన్నట్టూ రెండొ పుస్తకం ఎప్పుదు తెస్తున్నారండి నారాయణ స్వామిగారు?