Saturday, December 19, 2009

ఎర్ర పొస్టర్ కు అరవై ఏళ్ళు.


అనగనగా ఒకడు, నలుగురిలొ ఒకడుగా వుండక ఒఖడై ఇంత నిప్పుని , ఇంతింత ఎరుపుని మరింత చదువుని ఇంకెంతొ అరాచకాన్ని ఆకళింపు చేసుకుంటే మోహన్ అయ్యాడు.
గీతల కేరింతల సన్నటి కవిత్వపు సొగసులు, పిడికిళ్ళు బిగించిన బండ రేఖలు, ఎడా పెడా ఫెడీ ఫెడీ విసిరిన అక్షరాలు, గచ్చకాయ చురుకుల రాజకీయ కార్టూన్లు , సరాసరి శిఖరాలావతలికి లాక్కుపొయే కథల బొమ్మలు, లైన్ ఆఫ్ ఎకనమి కారికేచర్లు, ఎప్పుదొ అప్పుడు బర బర మనిపించే పొర్ట్రైట్ లు అన్నిటికీ మించి అచ్చమైన తెలుగు వచనానికి ఆనవాల్లు మోహన్ రాతలు , మోహన్కే సాధ్యమైన మొహన్ రాతలవి. అట్టి మోహన్ కి 60 ఏళ్ళట ఇదంత అందుకొసమట అనడం చిన్న సాకు, మోహన్ ని ఇలా తలుచుకొవడం పెద్ద పండుగ.