ఇవాళ శ్రీ సాయి బ్రహ్మానందం గొర్తి గారి బ్లాగ్ లొ హేరీ పాటర్ ఎక్కడ? మనం ఎక్కడ? అనే వ్యాసాన్ని చదివి ఊరుకొలేక ఉరి వేసుకున్న విధమిది...
కొన్ని విషయాలని ముని వేళ్ళతొ ముట్టుకున్న మనిషినంతా దగ్దం చేయడానికి సిద్దంగా వుంటాయి కొన్ని బేరాలు,
ప్రపంచమంతా ఆదరించిన, ఆదరిస్తున్న ఒక రచనను మనకుతీరుబడి వుంటే చదువుదాం, అది మనల్ని ఆనంద పెడితే సంతొషం, లేపొతే లేదు, అభివ్రుద్ది చెందిన దేశాలైన అమెరికన్ , యురొపియన్ మార్లెట్ లొ ఇటువంటి సాహిత్యానికి, కళలకు ..... సవాలక్ష విషయాలకు సమయం వుంది, వెచ్చించడానికి డబ్బూ వుందీ, క్వాలిటీ వర్క్ మీద ప్రేమ వుందీ.
మా రౌలింగ్ గొప్పా, మీ దాసరి గొప్పా అని ఎన్నడూ ఆలొచించని వారికి లేని బాధ ఇక్కడివారికెందుకొ అస్సలు అర్ధంకాదు.. భూమి చాలా పెద్దదికదా! ఖండం దాటి పొవదం ఎందుకు గాని మన పొరుగు రాష్త్రాల్లొ , పొరుగు భాషల్లొ, లిపులు లేని మన స్వంత గడ్డమీది మనకు పరిచయం లేని మన వాళ్ళ మౌఖిక మైన మహత్తర కథలుఎన్ని వున్నాయొ , అవి వేటికి సమానమొ, వేటికన్న మహా ఎక్కువొ మనకు తేలుసునా??
ఒకరిని తక్కువ చేయడం ద్వారా అయ్యే ఎక్కువ మనకెందుకు??? పది రొజులకిందట మౌనంగా వెళ్ళిపొయిన దాసరి గారు చెప్పింది ఇదే కదా , అయన మక్కువ చెందొ, మనసుపడొ, ఉద్యొగధర్మం కిందొ , వేలమంది ఆత్మల కింపుగా రచనలు చేసినారు, అరవైయేల్ల ఖజానానుండి ఎట్టి పేరు ప్రఖ్యాతులను,సన్మానాలను ఆశించలేదు. ఆయనెవరొ శ్రీ వేణు గారి పుణ్యమాని ఆయన చివరి దశలొ దాసరి సుబ్రహ్మణ్యం గారి పేరు బయటకు వచ్చింది,
మనం ఎదైనా చేయ్య వలసినది వుందా అంటే ఇద్దరు రచయితల మధ్యనొ, వారి రచలన మధ్యనొ మల్ల యుద్దం పెట్టి ఉద్రేక పడిపొవడం కాదు, నీ చేతనవుతే ఆ వ్యక్తికి ఒక పలకరింపు, ఒక దండం, మీకు ఫలానా బొయెర్ పెన్నంటే మక్కువ అని తెలిసింది, వేయి రూపాయలు పెట్టి కొనడం మీకు కష్టం కావచ్చును , మీకది ఇవ్వదం నాకు ఇష్టం, మీ ఇద్దరి చేతుల మధ్య ఆ పెన్ను , దాని తాలూకూ స్పర్స ఆయనకు , ఆయన గుండె చెమ్మ మీకు ... అది ముఖ్యం , గొడ మీద మనకు జనమనిచ్చిన మన తల్లిదంద్రుల ఫొటొ ల మధ్య , తాతల ఫొటొల మధ్య, నేనూ ఆవిడా, పిల్లలు ఫొటొ ల మధ్య, నీకు ఒక చదువునిచ్చిన , ఒక సాహిత్యాన్ని చూపిన ఒక దాసరి వారొ, కొట్లాది రూపాయలని స్వాతంత్రానికై పొసి , మధ్యాన బొజనానికి గతిలేక నిస్సారం గా గడిపిన ఒక టంగుటూరి వారొ, బొమ్మల్ని అమ్ముకుని దర్జా గా బతక గలిగినా అమ్మడానికి అది బొమ్మకాదని జీవితమని నమ్మి దిక్కుమాలి చచ్చిన ఒక చిత్తప్రసాద్ వారినొ, మనిషి అంటే పని , పది మందికి ఉపయొగ పడేదె పని అని వాడే మనిషని అట్టి మనుషులకై ప్రాణాలర్పించిన డాక్టర్ బెతూన్లాంటి మహా మనుషులకు గొడమీద స్థానం కల్పించండి, మీ పిల్లలు , వాళ్ళ పిల్లలూ, మీ ఇంటికొచ్చే మీ భంధువులు ,మిత్రులకు ....... గొడమీది ఫొటొ ఎవరిదీ అని అడిగే ప్రతి ఒక్కరికి వారి గురించి చెప్పండి, శక్తి వుంటే వారిని గూర్చిన పుస్తకాలు బహుమతులుగా ఇద్దాం.
చర్చలు వద్దు స్వామి!! చేతలు, ఒక బాపునొ, ఒక చందమామ శంకరొ, మారియొ మిరండానొ, నండూరి రామ్మొహన రావొ, కనక సూరి బాబొ ... ఎవరైతే వారు మీకేవరిష్టముంటే వారు , వెళ్ళండి ,కలవండి దండం పెట్టుకోండి చాన్స్ మళ్ళీ రాదు గాట్టిగ కావిలించుకోండి, మీ స్రుజన గొప్పది , మీరంటే మాకిష్టం, మిమ్మల్ని గురించి ఆలొచించే మీ అనుకునే వాల్లు కాక మేముకూడా వున్నాం అని సంతొషపెట్టండి.
సంవత్సరం కింద మా పతంజలి ప్రభువు భూమ్మీదే వున్నారు, ఆయనున్నాల్లు ఆయన్ని ప్రేమించీ కూడా కలవలేక పొయి దుఖ పడతున్న వాళ్ళని నేనుచూస్తున్నాను. ఆ జాబితాలొ మనం వద్దు , బ్రతుకు ఇట్టాగే ముండబారి పొయి వుంటుంది, రేపు సుఖంగా ఏమి వుండదు. జేబులొ చిల్లరుందా ? చలొడిల్లి! మిలొ జయ చంద్రన్ !