Sunday, March 6, 2011

జ్ఞాపక రమణీయం......

                      అది గురు నానక్ జయంతా? వరహ ద్వదశా? ముక్కొటి ఏకా దశా ఎప్పుడూ పట్టించుకున్నది లేదు,కేలండర్లొ ఎర్రక్షరాలు కనబడ్డాయా చాలు బాపు గారికి పొన్ కొట్టాల్సిందే విషేష్ చెప్పాల్సిందే.. అట్లాంటి రొజులేవి రొజుల్లొకూడా పొన్ చేసే వాణ్ణి " పనేం లేదు బాపు గారు ,వొట్టి పుణ్యానికే మీ గొంతు విందావని అంతే" చండ ప్రచండుడైన బాపు గారితొనే ఇంత తులవ గా వుంటే చల్లని రమణ గారి తొ ఇంకెంత వేషాలు పడవచ్చు ? సరస్వత్తొడు , వొట్టిపుణ్యానికి కాదు కదా గట్టి పనిమీద కూడా ఆయనకు పొన్ చేసిందే లేదు (వొక్క సారితప్ప)ఎప్పుడూ బర్థ్ డే విషెష్ గాని, భర్త డే శుభాకాంక్షలు గాని చెప్పిందీ లేదు  ఎందుకొ ఆయనంటే అదొ జంకు............................