ఇంగ్లీషు మాట దొర్లని తెలుగువాక్యంలేనట్లుగానే, బాపు బొమ్మ చూడని రొజంటూ వుంటుందా? దినాం చూడబడుతున్న పేపరులొగాని, చదవబడుతున్న పత్రికల్లొ , దిక్కుమాలించబడుతున్న చానల్లలోంచి, పెళ్ళి పత్రికలు, బారసాల అహ్వానాలు........................అనేక సకలం బాపుగారి బొమ్మల్తొ , అక్షరాలతొ నిండి వున్నాయి కదా మళ్ళీ ఈ కొలువెందుకు ప్రభూ? అనే సందేహం సమంజసమే.
మీరు చూస్తున్న పత్రికల్లొ బొమ్మకి- అచ్చయిన బొమ్మకి తేడా ఎంతొ తెలుసునా 60 నించి 70 శాతం, రంగులొనైనా, రేఖలొ నైనా కనీసం అంత తేడాతొ బొమ్మ ప్రింట్ అవుతుంది, డిజిటల్ బొమ్మలొ, ఆయిల్ పెయింటింగులొ ఎప్పుడూ చిత్రకారుని సత్తా బయట పడదు, (డిజిటల్ బొమ్మని కొటి సార్లు కంట్రొల్ జెడ్ కోట్టి,, ఆయిల్ పెయింటింగ్నయితే అరకొటి సార్లు కోటింగ్ మార్చి దిద్ది చూపవచ్చు) ఇంక్ డ్రాయింగ్కి, నీటి రంగులకి అంత అద్రుష్త్టం వుండదు, గుండెనిండా గాలి, సత్తా నింపుకున్న ఇంకు గీత ఒక్కసారి దూసామా...........
(పేపర్ పైన ఇంకు కన్నా పోస్టర్ వైట్ నింపే చిత్రకారులు కూడా వుండవచ్చు ,అద్రుష్టం కొద్ది వారు వొరిజినల్ చిత్రాల ప్రదర్శన పెట్టరు కాబట్టి భయము వద్దు)
పప్పి వారి మైనం అగ్గి పెట్టె సైజ్ నుంచి A3 నర్ర కొలత వరకు గల - ఒక్క బాపు గారికే సాధ్యమైన బాపు రేఖలివి , మీకైతే తీరిక వుం డదు గాని బొమ్మలతొ పొట్ట నింకునే నా బొటి వాడ్కి , ప్రపంచం మూలల్లొ మహత్తరమైన రేఖా విన్యాసాలకోసం వెతికే నాకు తెలుసు, బాపు లాంటి చిత్రకారుడు ప్రపంచంలొ ఎక్కడా లేరు (విపులా చ పృథ్వీ అని ఎవరైనా అంటే నేనేం మాట్లాలేనుగాని ) కనీసం భారద్దేశం వరకు గ్యారంటి, అయ్యా నీకున్న స్కొడా కారు, మీ అబ్బాయిగారి కొస్తున్న 50 లాక్స్ ఫర్ ఆనం కాదు మన అద్రుష్టం, బాపు పుట్టిన గడ్డ పై పుట్టడమే మన జన్మ చేసుకున్న పుణ్యం. గుర్రాన్ని నీటి దగ్గరికి తీసుకెల్లే ప్రయత్నం కాదిది. మీఇంట్లొనొ, మీ బంధువులింట్లొనొ కొన్ని బుల్లి చేతులుంటాయి, గోళ్ళల్లొ మట్టితొ బాటు క్రెయాన్ మైనాన్ని కూడా నింపుకున్న చేతులవి, మన సంస్కార లేమి వల్ల ఇప్పటికే ఆ బుర్రలనిండా పొకేమాన్ లు మిక్కి మౌసు లు తిష్ట వేసుక్కూచునుంటాయి , ఒక్కసారి వాళ్ళకు బుడుగును కూడా చూపించండి, బాపుని దర్శింప చేయండి , ఇప్పుడు కాకపొతే మరెప్పుడు కాదు
నేను పుట్టకముందటి అంటే 35 సంవత్సరాలకు ఇంకా అంత క్రితం బంగారు రొజుల్లొ బాపుగారి ఒరిజినల్స్ తొ వొ ప్రదర్శన జరిగిందట, ఆప్పటి ఆ బొమ్మల్ని ఒల్లంతా కళ్ళై నింపుకున్న ఒ చంద్రశేఖర్ దరిమిలా ఆర్టిస్ట్ చంద్ర అయ్యారు. ఆ తరువాత్తరువత బాపు బొమ్మల్నించి గొపీలు, మొహన్ లు కరుణాకర్లు బయటికొచ్చారు ,తెలుగు ఇలస్ట్రెషన్ పుట్టి ఇంకా 80 ఏండ్లు కూడా కాలేదు , చావడానికి సిద్దంగా వుంది .సినిమా వాళ్ళకు , రాజకీయం వాళ్ళకేనా వారసులు! కళలకు వద్దా ??
మనకు చాలినంతమంది పొలీసులు, పొలిటీషియన్లు, కల్యాణ్ పవన్లు, కమ్ముల శేఖర్లు వున్నారు, మిగుల్చుకొడానికే బాపు, చంద్ర, గొపి, బాలి, మొహన్, కరుణాకర్లు లేరు, మీవెంట తీసుకొచ్చే మీ చిన్నారుల్లొ ఒక బాపు వుంటాడు వాడి కోసమే ఈ కొలువు, దాని కొసమే బాపు బొమ్మల కొలువుకు మీరు రావాలిపుడు.